ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎ. రాజేంద్ర ప్రసాద్
అమరావతి – ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన విజయం కానే కాదని ఇది పూర్లిగా ప్రజలు సాధించిన గెలుపు అని అన్నారు. డిక్లరేషన్ ఫామ్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న 2,41,000 ఓటర్లు నాకు మద్దతు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోవడం మరింత ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని పెంచేలా చేసిందన్నారు.
గెలుపొందిన అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చారని, ఇది తాను కలలో కూడా ఊహించ లేదన్నారు. ఏకంగా తనను 1,45,000 వేల ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటరుకు రుణపడి ఉంటానని చెప్పారు.
ప్రత్యర్థి లక్ష్మణరావు కి అతి తక్కువ గా 63 వేల మంది ఓటు వేశారన్నారు. గడిచిన 5 సంవత్సరాలు పరిశ్రమలు పెట్టాలంటే భయపడ్డారని ఆవేదన చెందారు. కూటమి అధికారంలోకి రాగానే అనేక పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రానికి ముందుకు వస్తున్నాయని అన్నారు.
ఎంతో మంది నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులను బ్రాందీ తాగడానికి కాపలాగా పెట్టిన చరిత్ర జగన్ రెడ్డిదంటూ మండిపడ్డారు. యూనివర్శిటీలను రాజకీయాలకు కేరాఫ్ గా మార్చారని, వాటిని గాడిలో పెడుతున్నామని చెప్పారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.