తెలంగాణ అమరులకు వందనం
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ నివాళి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సెన్సేషన్ గా మారారు. తను యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. గత కొంత కాలంగా విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం చేశారు. ఆయన తాజాగా శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు.
గురువారం ఊహించని విధంగా సిటీలోని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అందులో ప్రయాణం చేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. వారంతా కాంగ్రెస్ కు రుణపడి ఉన్నామని పేర్కొన్నారు.
అంతకు ముందు గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. అమర వీరుల త్యాగం తనకు స్పూర్తి కలిగిస్తుందన్నారు. విద్యార్థుల పక్షాన పోరాడానని, వారి గొంతును సభలో వినిపిస్తానని స్పష్టం చేశారు.
గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తూ వచ్చానని అన్నారు బల్మూర్ వెంకట్. సమస్యలు పరిష్కరించేందుకు అమర వీరుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.