జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం శాసన మండలిలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం వెంటనే ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. దీని కోసం లక్షలాది మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు వేచి చూస్తున్నారని తెలిపారు బల్మూరి వెంకట్ .
ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాబ్స్ భర్తీ చేసే విషయంలో నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో ఉద్యోగాల ఎంపిక విషయంలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని, వాటిని ప్రభుత్వం సరి చేసిందని స్పష్టం చేశారు బల్మూరి వెంకట్.
దానితోపాటు జీవో 46, జీవో 317 అంశాలను త్వరగా పరిష్కరించి యువకులకు, నిరుద్యోగులకు అండగా నిలువాలని కోరారు. అలాగే 2008 డీఎస్సీ సమస్య ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. ఇందుకు సంబంధించిన సమస్యను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కరించారని చెప్పారు ఎమ్మెల్సీ.
ఇదే సమయంలో జాబ్ క్యాలెండర్ లో పీఈటీ పోస్టులు ఉండేలా చూడాలని కోరారు.