Friday, April 18, 2025
HomeNEWSఅల్లు అర్జున్ వ‌న్నీ అబ‌ద్దాలే

అల్లు అర్జున్ వ‌న్నీ అబ‌ద్దాలే

ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్

ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. న‌టుడు అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌శ్చాతాపం వ్య‌క్తం చేస్తార‌ని అనుకుంటే అదేమీ లేకుండా తాపీగా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఆరోజు థియేట‌ర్ నుంచి మీరు ఎలా వెళ్లార‌నేది వీడియోలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. రేవ‌తి ఘ‌ట‌న తెలిసినా ట‌పాసులు కాల్చ‌డం దారుణ‌మ‌న్నారు.

ఆదివారం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ రియ‌ల్ హీరో కానే కాద‌న్నారు. ఆయ‌న కేవ‌లం రీల్ హీరో అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాను త‌ప్పే చేయ‌లేన‌ట్టుగా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు .

శాస‌న స‌భ‌లో సీఎం మాట్లాడిన మాట‌ల‌ను త‌ప్పు ప‌ట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. చ‌ని పోయిన రేవతి కుటుంబం ప‌ట్ల అల్లు అర్జున్ క‌నీసం సానుభూతి చూపించ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట‌లో మ‌హిళ చ‌ని పోయింద‌ని చెప్పినా హీరో క‌నీసం స్ప‌దించ‌క పోవ‌డం దారుణ‌మన్నారు. త‌న కొడుకు బాధ ప‌డుతున్నాడ‌ని అల్లు అర‌వింద్ చెప్ప‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు బ‌ల్మూరి వెంక‌ట్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments