జగన్ స్కామ్ లపై చర్చకు సిద్దం
మాజీ సీఎంకు ఎమ్మెల్సీ సవాల్
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంతులేని అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. సోమవారం ఆయన మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
పులివెందులలో జరిగిన అక్రమాలకు, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మున్సిపాల్టీకి సంబంధించి ఏర్పాటు చేసిన మెగా లేఅవుట్ లోనే రూ. 175 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇలాంటి స్కాంలు చాలా ఉన్నాయని, వాటిని బహిర్గతం చేసేందుకు రెడీగా ఉన్నామని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ.
జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్దిదారులు .. భోగస్ లబ్దిదారులు, అనర్హలు అని తేలిందన్నారు.
ఇక వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కాం జరిగాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు.