ఓడి పోతామని వైదొలిగారు – ఎమ్మెల్సీ
భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కామెంట్స్
అమరావతి – తెలుగుశం పార్టీ ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ బాస్, మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. శుక్రవారం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ప్రజా మద్దతు లేదని తెలిసి, ఓడి పోతామనే భయంతో గ్రాడ్యూయేట్ శాసన మండలి ఎన్నికల నుంచి వైసీపీ తప్పుకుందని ఎద్దేవా చేశారు.
పోటీ చేస్తే పరువు పోతుందని ఓటమిని ముందే ఒప్పుకొని గ్రాడ్యుయేట్ ఎన్నికల నుంచి వైసీపీ నేతలు తప్పుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యవాదులను వేధించి, హింసించి, అవమానించడం జరిగింది నిజం కాదా అని భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ సంఘటనలు ఎలా మరిచి పోతామని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గతంలో టీడీపీ నాయకులు తుమ్మినా, దగ్గినా వారిపై కేసులు పెట్టిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామని వైసీపీ నాయకులు చెప్పడం ఓటమిని అంగీకరించినట్లేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందని స్పష్టం చేశారు భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి.
శాసనసభ సమావేశాలకు వైసీపీ నాయకులు రాకుండా పారిపోవడం దేనికి సంకేతమో చెప్పాలని అన్నారు. వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటే కావలసిన సౌకర్యాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న రెండు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ