NEWSTELANGANA

తెలంగాణ నాశ‌నం దిశ‌గా రేవంత్ స‌ర్కార్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రం పాలిట కాంగ్రెస్ ప్ర‌భుత్వం శాపంగా మారింద‌ని ఆరోపించారు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు లేకుండా చేయాల‌ని కోరుకుంటున్నార‌ని, ఆ దిశ‌గా దాడుల‌కు పాల్ప‌డేలా ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

బీఆర్ఎస్ లో ఉన్న‌ప్పుడు దానం నాగేంద‌ర్, మైనంప‌ల్లి హ‌నుమంత రావు, అరిక‌పూడి గాంధీల భాష‌, ప్ర‌వ‌ర్త‌న ఎట్లా ఉండేద‌ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాక వారి భాష దారుణంగా త‌యారైంద‌న్నారు.

వీరి భాష‌, ప్ర‌వ‌ర్త‌న వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్.

అవాకులు, చెవాకులు బంద్ చేస్తే బెట‌ర్ అని సూచించారు. ప్ర‌జ‌లు మీరు చేస్తున్న నిర్వాకాన్ని చూశార‌ని తెలిపారు.