అనిల్ కుమార్ పై జంగా ఫైర్
సంపాదన కోసం నేను రాలేదు
గుంటూరు – తనపై అనుచిత కామెంట్స్ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి. నాపై లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. తనకు ఎవరో స్క్రిప్టు రాసి ఇచ్చారని పేర్కొనడం దారుణమన్నారు. సంపాదించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.
వైసీపీలో అందుకోసం చేరలేదని పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఎవరు ఎవరికి భజన చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు జంగా కృష్ణ మూర్తి.
ఎవరి మెప్పు , లబ్ది పొందేందుకు తాను పాలిటిక్స్ లోకి రాలేదన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బీసీలకు పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చారే తప్పా పవర్ మాత్రం వాళ్ల చేతుల్లో ఉందన్నారు.
బహుజనులకు ఆత్మ గౌరవం ముఖ్యమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీ చేపట్టిన చరిత్ర తనదన్నారు.