చెప్పకుండా చేర్చుకుంటే ఎలా
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మంగళవారం షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలియ కుండానే , తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు.
ఆయన బహిరంగంగా కామెంట్స్ చేయడం పార్టీ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది. విచిత్రం ఏమిటంటే తాను ఎవరి మీదనైతే కొట్లాడానో వారినే పార్టీలో చేర్చుకుంటే ఎలా అని నిప్పులు చెరిగారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు.
ప్రస్తుతం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు , చేస్తున్న ప్రకటనలు పార్టీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలను విస్మయ పరిచేలా చేసిందన్నారు జీవన్ రెడ్డి. ఉదయం పత్రికల్లో, టీవీ ఛానళ్లలో చూసి తెలుసు కోవాల్సిన దుస్థితి పట్టడం బాధ కలిగించిందన్నారు.
40 ఏళ్ల సీనియర్టీకి హై కమాండ్ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు . ఇక పార్టీ ఎందుకు..ఎమ్మెల్సీ పదవి ఎందుకంటూ ప్రశ్నించారు.