NEWSTELANGANA

గ‌ల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలి

Share it with your family & friends

ఎన్నారై పాల‌సీ తీసుకు రావాలి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో త‌క్ష‌ణ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నారై పాల‌సీ తీసుకు రావాల‌ని, వెంట‌నే గ‌ల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కోరారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా సుదీర్ఘ లేఖ రాశారు . దానిని రేవంత్ రెడ్డికి అంద‌జేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నారని వాపోయారు.

వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి కోరారు.
గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చిందని, శంషాబాద్ విమానాశ్రయం నుండి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఉచిత అంబులెన్స్ సేవలను అందించిందని పేర్కొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ ఇతర నాయకులు ఇదివరకే ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చారని జీవన్ రెడ్డి వివరించారు.