NEWSTELANGANA

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ – ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. 11 నెల‌ల కాంగ్రెస్ పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు. భారీ ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త మూట క‌ట్టుకుంద‌న్నారు.

పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ ను ప్రజలు క్షమించర‌ని స్ప‌ష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత స‌మావేశం అయ్యారు. పూర్తిగా బీసీల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ బీసీ క‌మిష‌న్ ను క‌లిసి పూర్తి నివేదిక అంద‌జేస్తామ‌న్నారు .

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వ్యక్తులను ప్రజలు క్షమించరని స్ప‌ష్టం చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇవాళ కుల గ‌ణ‌న క‌మిష‌న్ కు రిపోర్ట్ అంద‌జేస్తామ‌న్నారు. జ‌గిత్యాల‌కు త‌మ‌కు తెగి పోని బంధం ఉంద‌న్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ది చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ ఈ సర్కార్ వ‌చ్చాక పూర్తిగా విస్మ‌రించింద‌న్నారు. ఆనాడు హైదరాబాద్ తరువాత ఎక్కువ సంఖ్యలో 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ద చూపెట్టారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్య‌మైన‌వ‌ని , వాటిలో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు.