ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ దురుద్దేశంతో, కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్రంగా ఖండించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేట తెల్లమైందన్నారు.
కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గల గలా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. దీనిని తెలుసు కోకుండా కేవలం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీపై, సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం అని వెల్లడించారు.
రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.