మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అక్రమం
తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.
చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోందని పేర్కొన్నారు. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అంటూ ధ్వజమెత్తింది.
ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బందిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.
తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచి వేయాలను కోవడం మూర్ఖత్వం అని స్పష్టం చేశారు.