NEWSTELANGANA

ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను వ‌ద‌ల‌ను – క‌విత

Share it with your family & friends

త‌న‌ను కావాల‌ని జైల్లో పెట్టారంటూ ఫైర్

హైద‌రాబాద్ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని 166 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ క‌విత ఎట్ట‌కేల‌కు సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను కావాల‌ని ఇబ్బంది పెట్టిన ప్ర‌తి ఒక్క‌రి గురించి తెలుస‌న్నారు. వారిని ఊరికే వ‌ద‌ల‌బోనంటూ హెచ్చ‌రించారు.

ఒక్కొక్క‌రి బ‌దులు తీర్చుకుంటాన‌ని, వ‌డ్డీ తో స‌హా క‌క్కిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ క‌విత‌. తాను తెలంగాణ బిడ్డ‌న‌ని, త‌న‌కు మోసం చేయ‌డం, త‌ప్పు చేయ‌డం తెలియ‌ద‌న్నారు . గ‌త 18 ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో చూశాన‌ని, ఇలాంటి వాటికి, వేధింపుల‌కు తాను భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

కొంద‌రు కావాల‌ని అస‌త్య ప్ర‌చారం చేశార‌ని, వారిని కూడా వ‌ద‌ల బోనంటూ పేర్కొన్నారు క‌విత‌. ఢిల్లీ మ‌ద్యం కేసుకు సంబంధించి త‌నను కావాల‌ని ఇరికించార‌ని, దీని వెనుక రాజ‌కీయ ప్ర‌మేయం ఉంద‌న్నారు క‌విత‌.

త‌న‌ను ఇక్క‌ట్లు పాలు చేసిన వారు ఇబ్బందులు ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌న్నారు . కావాల‌ని డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని, ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.