కమిషన్ చైర్మన్ కు సమర్పణ
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో డెడికేటెడ్ కుల గణన కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర్ ను కలిసి నివేదిక అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కుల గణనకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కావాలని కేంద్రం బీసీ కుల గణన చేపట్టడం లేదని ఆరోపించారు కవిత.
ఇదిలా ఉండగా బీసీ సంఘాలతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ , తెలంగాణ జాగృతి సంస్థ నాయకులతో కలిసి కుల గణనకు సంబంధించి 35 పేజీలతో కూడిన డాక్యుమెంట్ ను సమర్పించింది. ఈ విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు కవిత. మాటల వరకే బీసీల జపం చేస్తున్నారని, అసలైన బహుజనులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే కుల గణనపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందంటూ మండిపడ్డారు కవిత.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల సందర్బంగా కామారెడ్డిలో జరిగిన డిక్లరేషన్ లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు.