కవితకు జ్యుడిషియల్ రిమాండ్
ఏప్రిల్ 9వ వరకు విధించిన కోర్టు
న్యూఢిల్లీ – సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం సంచలన ప్రకటన చేసింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆమె. ఈ కేసులో కీలకమైన పాత్ర పోషించిందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆరోపించింది. ఇదే విషయాన్ని పదే పదే కోర్టుకు తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి పలువురు అప్రూవర్ గా మారారు. వారంతా ఒకే ఒక్క పేరు తెలిపారు. వారెవరో కాదు కవిత పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవాళ కేసుకు సంబంధించి కస్టడీ మంగళవారం నాటితో ముగియనుంది. తిరిగి కల్వకుంట్ల కవితను కోర్టులో ప్రవేశ పెట్టారు.
వాదోప వాదనలు విన్న కోర్టు వచ్చే నెల ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే సమయంలో కల్వకుంట్ల కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటవ తేదీన విచారణ చేపట్టనున్నారు. ఆ రోజు బెయిల్ ఇస్తారా లేదా అన్నది తేలుతుంది. ఇప్పటికే తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది ధర్మాసనం.