కేసీఆర్ బిడ్డను తప్పు చేయను – కవిత
కావాలనే చెరసాలలో ఉంచారు
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే జైల్లో పెట్టారని ఆరోపించారు. కేవలం రాజకీయాల కోసం తనను ఇన్ని రోజులుగా చెరసాల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ఆమె దాదాపు 165 రోజులకు పైగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆగస్టు 27న మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కోర్టులో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున ప్రముఖ న్యాయవాది , కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ రోహత్గీ వాదించారు. జైలులో ఉన్న సమయంలో కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గైనిక్ ప్రాబ్లంతో పాటు వైరల్ ఫీవర్ కు లోనయ్యారు. ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కేవలం పాలిటిక్స్ కోసమే తనను జైలులో ఉంచారని యావత్ దేశం మొత్తానికి తెలుసన్నారు కవిత. తాను తెలంగాణ బిడ్డనని, నిఖార్సయిన కేసీఆర్ కూతురనని, తప్పు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడుతూనే ఉంటానని, నిర్దోషిగా నిరూపించు కుంటానని అన్నారు.