కేసీఆర్ ఆలింగనం కవిత భావోద్వేగం
కేసీఆర్ ను కలుసుకున్న కూతురు
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఫామ్ హౌస్ లో ఉన్న తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆయన కాళ్లకు దండం పెట్టారు. అనంతరం కూతురును ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు కేసీఆర్. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు.
అంతకు ముందు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. కవితతో పాటు ఆప్ కు చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ , మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి కవితపై. దీనిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను 166 రోజుల పాటు జైలులో ఉంచారు. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎయిమ్స్ కు తరలించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. ఇవాళ తన తండ్రి కేసీఆర్ ను కలుసుకున్నారు చాలా రోజుల తర్వాత.