సంధ్యను పరామర్శించిన కవిత
భర్త మరణం బాధాకరమన్న ఎమ్మెల్సీ
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ సామాజిక, ప్రజా సంఘాల నాయకురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి ఇటీవలే కన్ను మూశారు. ఆయన తీవ్ర అనారోగ్యం కారణంతో మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం.
ప్రింటింగ్ ప్రెస్ ను స్థాపించి ప్రగతిశీల, అభ్యుదయ భావాలు కలిగిన రచయితలు, కవులు, కళాకారులకు సంబంధించి పుస్తకాలను అచ్చు వేయడంలో కీలకంగా వ్యవహరించారు. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యను నివాసంలో కలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రామకృష్ణా రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తీవ్ర విషాదంలో ఉన్న సంధ్యను ఓదార్చారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.