NEWSTELANGANA

క‌ల్వ‌కుంట్ల క‌విత క్వీన్ పిన్

Share it with your family & friends

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో సంచ‌ల‌నం

న్యూఢిల్లీ – తీగ లాగితే డొంకంతా క‌దులుతోంది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో రోజు రోజుకు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ధానంగా నిన్న‌టి దాకా తన‌కేమీ తెలియ‌ద‌ని, తాను అమాయ‌కురాలినంటూ చిలుక ప‌లుకులు ప‌లికిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ఢిల్లీ మ‌ద్యం కుంభ కోణంలో కీల‌క‌మైన పాత్రధారి, సూత్ర‌ధారి ఆమెనేనంటూ తేల్చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట పెట్టింది. ముడుపుల వ్య‌వ‌హారంలోనూ, డ‌బ్బుల‌ను హ‌వాలా మార్గంలో త‌ర‌లించ‌డం లోనూ ముఖ్య పాత్ర పోషించింది క‌ల్వ‌కుంట్ల క‌వితేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

ప‌క్కా ఆధారాల‌తో స‌హా కోర్టు ముందు నివేదిక స‌మ‌ర్పించింది. ఇంకా ఈ స్కామ్ కు సంబంధించి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని, కానీ కొన్నింటికి మాత్ర‌మే క‌విత స‌మాధానం ఇస్తోంద‌ని, మిగ‌తా వాటికి మాత్రం నోరు మెద‌ప‌డం లేద‌ని ఆరోపించింది ఈడీ.

ఢిల్లీ కోర్టులో ఈ కేసు విచార‌ణ సంద‌ర్బంగా త‌మ‌కు క‌స్ట‌డీకి ఇస్తేనే నిజాలు తెలుస్తాయ‌ని పేర్కొంది. కోర్టు మ‌రో మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది.