NEWSTELANGANA

సీబీఐ క‌స్టడీ కాదు బీజేపీ క‌స్ట‌డీ

Share it with your family & friends

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కామెంట్

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉంది ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తాను ఏ పాపం చేయ‌లేద‌ని, త‌న‌కు ఎవ‌రితోనూ సంబంధాలు లేవ‌ని, అస‌లు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ అంటే ఏమిటో తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే కేసుకు సంబంధించి సోమ‌వారం ఢిల్లీ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా క‌విత మీడియాతో మాట్లాడటాన్ని త‌ప్పు ప‌ట్టింది. గీత దాటొద్ద‌ని హెచ్చ‌రించింది. కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఎవ‌రైనా స‌రే మౌనంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా కేసుకు సంబంధించి బెయిల్ పిటిష‌న్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి నోటీసు జారీ చేసింది. విచార‌ణ‌ను ఏప్రిల్ 22 తేదీకి వాయిదా వేసింది. కాగా మీడియాతో మాట్లాడిన క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది కేంద్ర స‌ర్కార్ పై.

క‌క్ష సాధింపు ధోర‌ణితోనే త‌న‌ను అదుపులోకి తీసుకున్నార‌ని, ఇది సీబీఐ క‌స్ట‌డీ కాద‌ని ఇది ముమ్మాటికీ బీజేపీ క‌స్ట‌డీ అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.