తెలంగాణ తల్లి విగ్రహం ఆమోదించం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్
నిజామాబాద్ జిల్లా – ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లిని పల్లె పల్లెన ప్రతిష్టించు కుంటామని స్పష్టం చేశారు. గెజిట్ ఇచ్చినా..కేసులు పెట్టినా..అరెస్ట్ చేసినా భయపడ బోమన్నారు.
ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత. కోట్లాది మందిలో ధైర్యాన్ని, స్పూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని చెప్పారు. ఎవరు అడ్డుకున్నా ఒప్పుకోమని హెచ్చరించారు.
కోట్లాది గుండెలను ఒక్కటి చేసి..యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిన బతుకమ్మ జోలికి వస్తే ఊరుకోమంటూ మండిపడ్డారు. తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామన్నారు. అవసరమైతే ఉద్యమించేందుకు సిద్దమని ప్రకటించారు.
తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడతామని అన్నారు.