పాలనలో రేవంత్ తమ్ముళ్ల జోక్యం
ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ బేకార్ అంటూ ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
తమపై పదే పదే కుటుంబ పాలన సాగించారంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు ఎమ్మెల్సీ. తమపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నేతలు తమ చరిత్ర తెలుసు కోవాలన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో 22 కుటుంబాలు ఉన్నాయని, ఆ విషయం తెలుసుకోక పోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. పేరుకే సీఎం పాలన అంతా ఆయన తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లి పోయిందని ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రియాంక గాంధీ ఏ హోదాతో ఇక్కడికి వస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు కవిత. ప్రజా దర్భార్ సంగతేమైందని ప్రశ్నించారు. 60 రోజుల్లో ఒక్క రోజు తప్ప మళ్లీ అటు వైపు పోయిర్రా… మంత్రులు కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం మానేసి అధికారులకు అప్పగించిండ్రని ఎద్దేవా చేశారు.