తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీరియస్ గా స్పందించారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ఆవిష్కరించడం బాధాకరమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతోందన్నారు. ఉద్యమ తల్లిని ఇవాళ కాంగ్రెస్ తల్లిగా మార్చారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని మండి పడ్డారు. సీఎం ఆవిష్కరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.
తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడం పట్ల మండిపడ్డారు. తెలంగాణ సమాజం సీఎంను క్షమించదన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ దుశ్చర్యకు తలెంగాణ తల్లి కంటతడి పెడుతోందంటూ వాపోయారు ఎమ్మెల్సీ.
ఆనాటి ఉద్యమ సమయంలో కోట్లాది మందిని ప్రభావితం చేసిన తెలగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చితే ఎలా అని ప్రశ్నించారు.