బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్న ఎమ్మెల్సీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. గురువారం ఆమె సంచలన లేఖ రాశారు. ఇందుకు సంబంధించి ఇది బయటకు రావడం కలకలం రేపుతోంది. తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందన్నారు. 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదన్నారు. ధూం ధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామని పేర్కొన్నారు కవిత. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడక పోవడం దారుణమన్నారు.
భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను కూడా కేంద్రంలోని పార్టీ కారణంగా తాను కూడా ఇబ్బందులు పడ్డానని వాపోయారు కవిత. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యిందన్నారు. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారని కానీ మీరు ఆ దిశగా ఆలోచించక పోవడం తనను బాధకు కలిగించిందన్నారు. ఇప్పటికైనా 1, 2 ప్లీనరీ పెట్టాలన్నారు.