ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్న బీఆర్ఎస్ కు చెందిన చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళో రేపో ఆయనను అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం.
రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా పాపం పోదని కానీ సంస్కారం అడ్డు వస్తోందని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
దళిత బిడ్డ అంటూ పేర్కొన్నారు . ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన రాచరికపు విధానాలనే ఇవాళ కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు . పూర్తిగా ఢిల్లీ కేంద్రంగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా సీఎంపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.