రేవంత్ అధికార దుర్వినియోగం
ప్రజల సొమ్ముతో సీఎం కేసు
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గురువారం కవిత మీడియాతో మాట్లాడారు. ఎవరైనా తమ స్వంత ఖర్చులతో కేసులు చూసుకుంటారని కానీ ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ రెడ్డి మాత్రం సీఎం అయ్యాక ప్రభుత్వ ఖర్చుతో భరిస్తుండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఇలాంటివి తెలియకుండా ఉంచాలని చూస్తే ఎవరూ ఊరుకోరని పేర్కొన్నారు కవిత. ఇంతకు ముందు నుంచి ఓటుకు నోటు కేసును వాదించిన లాయర్లను సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా నియమించారని తెలిపారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ.
మొన్నటి దాకా రేవంత్ రెడ్డి తన జేబులో ఇచ్చాడని, కానీ ఇప్పుడు సీఎం అయ్యాక సీన్ మారిందని ఆరోపించారు. దీనిని తాము ప్రజల్లోకి తీసుకు వెళతామని, తన స్వంత కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు భరించాలని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.
ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనని, దీనిని ఎందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నించడం లేదని అన్నారు.