రేవంత్ రాజకీయాలు చేయొద్దు
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాజకీయాలు చేయడం మానేసి రోస్టర్ పాయింట్ పై పెట్టాలని సూచించారు కవిత.
రోస్టర్ పాయింట్ రద్దును సవాల్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద ఆ కేసును ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు.
మీరు కొత్తగా జీవో జారీ చేసే ముందు మేధావులతో సంప్రదించారా అని నిలదీశారు కల్వకుంట్ల కవిత.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేక పోతే తమ పార్టీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత మీకే దక్కుతుందన్నారు.
ఇప్పటి వరకు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒరిగింది ఏమీ లేదని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత.