కూల్చిన ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తారా
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ – మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్లకు సంబంధించిన ఈఎంఐలు ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. తలా తోకా లేకుండా నిర్ణయాలు తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే కుదరదని, స్పష్టమైన విధానం అన్నది ఏదీ లేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. అసెంబ్లీలో బేడీలు వేసుకుని ఆందోళన చేపడితే నల్ల దుస్తులు ధరించి మండలిలోకి సభ్యులు వచ్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు.
మూసీ అభివృద్ది కోసం ఎంఆర్డీసీఎల్ ద్వారా డీపీఆర్ రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పడంపై నిలదీశారు. అప్పు కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది వాస్తవం కాదా అని నిలదీసే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కవిత.