మహిళలందరికి శుభాభినందనలు
హైదరాబాద్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేక పోతే ప్రపంచం లేదన్నారు. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్దిలో సైతం ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. చదువుపై , స్వశక్తితో పైకి వచ్చేందుకు కృషి చేస్తే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా స్పందించారు కల్వకుంట్ల కవిత. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని తాను అని స్పష్టం చేశారు. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశామన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించామన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో మహిళా సాధికారతకు కృషిచేశామన్నారు కవిత.