ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ వైరల్
సత్యమేవ జయతే అంటూ కామెంట్స్
హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్రమంగా తనను ఇరికించారంటూ ఆరోపించారు. ఇదంతా కావాలని, తన తండ్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను బద్నాం చేసేందుకు, రాజకీయ పరంగా దెబ్బ కొట్టేందుకు తనను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. అయినా చివరకు న్యాయం గెలుస్తుందన్న నిజం బట్ట బయలైందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో కల్వకుంట్ల కవిత బయటకు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను అక్రమంగా 166 రోజుల పాటు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత.
ఈ సందర్బంగా ఆమె ఇవాళ ట్విట్టర్ ఎక్స్ వేదికగా సత్యమేవ జయతే అంటూ పోస్ట్ చేశారు. ధర్మం నిలుస్తుందని, సత్యం ఎప్పటికీ చెరిగి పోదని స్పష్టం చేశారు . తనను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఊరికే వదలబోనంటూ హెచ్చరించారు. కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేశారని వాపోయారు. వ్యక్తిగతంగా కించ పరిచేలా కామెంట్స్ పెట్టడం, మీమ్స్ తయారు చేయడం, ట్రోల్స్ కు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు.