కొత్త కారు కొన్న కోదండరాం రెడ్డి
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు
తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు , శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండం రాం రెడ్డి కొత్త కారు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఆయనకు కీలకమైన పదవి దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గొంతు వినిపించారు. రేవంత్ సారథ్యంలోని హస్తం పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసేందుకు శత విధాలుగా ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరో వైపు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తూ వచ్చారు. ఎంతటి సమస్యనైనా విడమర్చి ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు కోదండరాం రెడ్డి. సకల జనుల సమ్మెను సక్సెస్ చేయడంలో, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి చెప్పడంలో ముందంజలో ఉన్నారు ఆనాడు.
ఇదే సమయంలో తెలంగాణ గాంధీగా పేరు పొందిన దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆచారితో పాటు కలిసి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఒక రకంగా మలి దశ తెలంగాణ మహొద్యమంలో కోదండరాం రెడ్డిది విస్మరించలేని పాత్ర అని చెప్పక తప్పదు.