NEWSTELANGANA

టెక్నాల‌జీ పెరిగినా పుస్త‌కాల‌కు జ‌నాద‌ర‌ణ

Share it with your family & friends

-ఎమ్మెల్సీ కొదండ‌రాం రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ – సాంకేతికంగా ప్ర‌పంచ వ్యాప్తంగా కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నా పుస్త‌కాల‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌ని, అంత‌కంత‌కూ ఆద‌ర‌ణ పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేద‌న్నారు హైద‌రాబాద్ బుక్ ట్ర‌స్ట్ గౌర‌వ స‌ల‌హాదారులు, ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి.

టెక్నాలజీ, ఈబుక్స్​, ఆన్​లైన్​ ​ ఎంత పెరిగినా.. పుస్తకాలను చ‌ద‌వ‌డం ఆప‌డం లేదన్నారు. ఇంటర్నెట్​ కాలంలో కూడా పుస్తకాలను చదవే పాఠకులు నిరంతరం పెరుగుతూ ఉంటారని చెప్పారాయన. ప్రెస్​ క్లబ్ లో 37వ హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ గౌరవ సలహాదారులను బుక్​ ఫెయిర్​ కమిటీ సభ్యులు ప్రకటించారు.

జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ కోదండ రాం, సీనియర్​ ఎడిటర్​ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్​ రమా మెల్కొటే బుక్​ ఫెయిర్ సొసైటీకి గౌరవ సలహాదారులుగా ఉంటారని ​ బుక్​ ఫెయిర్​ అధ్యక్షులు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో తెలిపారు.

ఈ సందర్భంగా బుక్​ ఫెయిర్​ కమిటీ సభ్యులతో కలిసి 37వ బుక్​ ఫెయిర్​ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండ రామ్​, రామచంద్రమూర్తి రమా మెల్కొటే మాట్లాడుతూ.. హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప మహోత్సవం అని, సాహితీ ప్రియులు, పాఠకులు, విద్యార్థులు, యువత, ఎంతో మంది ఈ పుస్తక మహోత్సవం కోసం వేచి చూస్తుంటారని అన్నారు.

రచయితలను, పాఠకులను కలిపే వేదికగా బుక్​ ఫెయిర్​ ప్రాముఖ్య‌త‌ సంతరించుకుందని చెప్పారు. వందలాది పబ్లిషింగ్​ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం బుక్​ఫెయిర్​ సెక్రటరీ వాసు మాట్లాడారు. డిసెంబర్​ 19 నుంచి 29 వరకూ హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహించబోయే బుక్​ ఫెయిర్​కు ప్రజలు తరలిరావాలని కోరారు. సందర్శకుల కోసం అనుకూలమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్లాస్టిక్​ నిషేధాన్ని పాటిస్తూ.. సందర్శకుల కోసం టికెట్లతో పాటు పుస్తకాల కోసం ‘సంచి’ని ఇస్తామని పేర్కొన్నారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పది లక్షలకుపై పైగా జనం విజిట్​ చేస్తారని తెలిపారు.

విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఆయన వివరించారు. వివరాల కోసం 9490099081 ను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణరెడ్డి, వైస్​ ప్రెసిడెంట్లు కె. బాల్​ రెడ్డి, శోభన్​ బాబు, జాయింట్​ సెక్రటరీలు కె. సురేశ్​, ఎం. సూరిబాబు పాల్గొన్నారు.