నేరాలు..ఘోరాలు..మోసాలకు కేరాఫ్ జగన్ రెడ్డి
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
అమరావతి – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, ఘోరాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజల ఆస్తుల్ని కొట్టేసి 31 కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ మీద బయట తిరుగుతూ 2019-2024 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పీడలా దాపురించి ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, నవ రత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించారు.
పరిశ్రమలను వెళ్లగొట్టడం, యువతను గంజాయికి, డ్రగ్స్ కి బానిసలుగా మార్చడం, 2 లక్షల మంది మహిళలు, చిన్నారులపై దాడులు జరిగితే మిన్నకుండి పోవటం, ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయడం, పోలవరాన్ని గాలి కొదిలేయడం ఇన్ని నేరాలు , ఘోరాలు చేసి న ఘనత జగన్ రెడ్డిదన్నారు పంచుమర్తి అనురాధ.
సీఎం, లోకేష్ , అనిత గురించి అవాకులు చెవాకులు పేలడం దారుణమన్నారు. మీ హయాంలోనే దిశా చట్టం లేదని, అది కేవలం బిల్లు మాత్రమేనని పేర్కొన్నారు. గంటల తరబడి రోజుల తరబడి అబద్దాలు చెప్పడమే మీ పని కదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.
మీ నిర్వాకం గురించి, మీ మోనార్క్ గురించి మీ పార్టీ కోసం పని చేసిన మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పూసగుచ్చినట్టు చెప్పినా ఇంకా మీలో మార్పు రాక పోవడం దారుణమన్నారు పంచుమర్తి అనురాధ.