అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయండి
పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మహిళ మృతికి కారణమైన నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని, తక్షణమే అదుపులోకి తీసుకోవాలని కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆరోపించారు. ఇదిలా ఉండగా పోలీసులు నోటీసులు జారీ చేశారు బన్నీకి.
మరో వైపు తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరుతూ సంచలన ఆరోపణలు చేశారు ఏసీపీ విష్ణు మూర్తి. ఇంకోసారి గనుక నోరు జారితే తోలు తీస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు అల్లు అర్జున్ పై. ఆయనకు ఏమైందని సెలిబ్రిటీలు పరామర్శించారంటూ ప్రశ్నించారు. ఏమైనా కాలు పోయిందా, కాళ్లు పోయాయా లేక కిడ్నీలు చెడి పోయాయా అని నిలదీశారు అసెంబ్లీ సాక్షిగా.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కు పిల్లను ఇచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంకో వైపు సమస్యను సరిదిద్దేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నిన్న పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నం చేయగా ఘోర అవమానం జరిగింది. ఆమె కనీసం మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వలేదు.
దీంతో ఆయన నిరాశతో వెనుదిరిగారు. అక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు వెళ్లారు. మొత్తంగా బన్నీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.