తీన్మార్ సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. చేతకాక పోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. పాలనా పరంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు. కేవలం ప్రచారం కోసం ప్రయత్నం చేయడం తప్పా ఆయన చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ధిక్కార స్వరం వినిపిస్తుండడం పట్ల పార్టీలోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరో వైపు ఇటీవలే తను బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తూ వస్తున్నారు. మా కోటా మా వాటా మాకు దక్కాల్సిందేనంటూ కొత్త నినాదం అందుకున్నారు. ఇదే సమయంలో తనకు రెడ్ల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అవసరం లేదంటూ ప్రకటించాడు. మల్లన్నపై రెడ్లంతా ఒక్కసారిగా దాడి చేయడం మొదలు పెట్టారు.
88 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తమకు ఉన్నంగా మీ ఓట్లు అవసరం లేదంటూ గణాంకాల సాక్షిగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఏకంగా బలమైన పొంగులేటిని టార్గెట్ చేయడం పట్ల ఆసక్తిని రేపుతోంది.