Sunday, April 6, 2025
HomeNEWSకాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెన్షన్‌

కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెన్షన్‌

క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ జి. చిన్నారెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సస్పెండ్‌ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్‌ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
త‌న స‌స్పెన్ష‌న్ కు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఆయ‌న గ‌త కొంత కాలంగా బీసీ నినాదంతో ముందుకు వెళుతున్నారు.

ప్ర‌త్యేకించి రెడ్ల సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేశారు. వారిని అన‌రాని మాట‌లు అన్నారు. త‌మ పార్టీ ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం కానే కాద‌ని ఈ సంద‌ర్భంగా స్పందించారు. బీసీల‌ను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంద‌ని, అందుకే తాను గొంతు విప్పాల్సి వ‌చ్చింద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments