పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిపై కన్నెర్ర
రాజీనామా చేయాలంటూ కోర్టులోకి ఉగ్రమూక
పాకిస్తాన్ – పాకిస్తాన్ దేశ ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై భగ్గుమంటున్నారు ఇస్లామిస్ట్ సంస్థ సభ్యులు. చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి.
‘మతంపై హక్కు’ ఉందంటూ దైవ దూషణ కేసు నమోదైన అహ్మదీయా వ్యక్తిని విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. దీనిపై పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇస్లామాబాద్‌లోని అత్యంత సురక్షితమైన రెడ్ జోన్‌ను ఉల్లంఘించిన గుంపు సుప్రీం కోర్టు ప్రవేశ ద్వారాలను ముట్టడించింది.
ఇస్లామిస్ట్ సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) న్యాయమూర్తి ఇసా తలపై 1 కోటి పాకిస్తాన్ రూపాయల బహుమతిని ప్రకటించింది. అగ్ర నాయకుడు పీర్ జహీరుల్ హసన్ షా దీనిని ఇస్తామని అన్నారు.
సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో వేలాది మందితో కూడిన “సర్ తాన్ సే జుడా” మూక నిరసనలు తెలుపుతోంది.
గత ఏడాది నవంబర్‌లో పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఇసా అహ్మదీయా వ్యక్తి ముబారక్ సానీని విడుదల చేయాలని ఆదేశించిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి హత్య బెదిరింపులు, నిరసనలు ఎదుర్కొంటున్నారు. మే 29న, చీఫ్ జస్టిస్ ఇసా, జస్టిస్ ఇర్ఫాన్ సాదత్ ఖాన్ , జస్టిస్ నయీమ్ అక్తర్ ఆఫ్ఘన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.