NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ చొర‌వ‌తోనే రైల్వే లైన్ కు మోక్షం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్

ఢిల్లీ – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ బాంబు పేల్చారు. కేంద్ర మంత్రివ‌ర్గం ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి 57 కిలోమీట‌ర్ల మేర చేప‌ట్ట‌నున్న రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల చొర‌వ కార‌ణంగా ఇది సాధ్య‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీతో భేటీ అయిన సంద‌ర్బంగా కేపిట‌ల్ సిటీ అమ‌రావ‌తికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరార‌ని తెలిపారు.

ఇదే స‌మ‌యంలో రైల్వే లైన్ కు ఆమోదం తెలిపితే వివిధ ప్రాంతాల మ‌ధ్య క‌నెక్టివిటీ పెరుగుతుంద‌ని, దీని ద్వారా స‌త్ సంబంధాలు మ‌రింత ప‌టిష్టం అయ్యేందుకు వీలు కుదురుతుంద‌ని పేర్కొన్నార‌ని ఈ సంద‌ర్బంగా తెలిపారు రైల్వే శాఖ మంత్రి.

ఏపీ ప్ర‌జ‌ల క‌ల‌ను కేంద్రం నెర‌వేర్చింద‌న్నారు. దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు క‌నెక్టివిటీ పెంచేందుకు తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.