NEWSNATIONAL

కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు

Share it with your family & friends

14 పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర

న్యూఢిల్లీ – దేశంలో కొత్తగా కొలువు తీరిన మోడీ బీజేపీ, సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఇందులో భాగంగా రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. వారు పండించే పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

మొత్తం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ తీర్మానం చేసింది. వరికి రూ. 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర రూ. 2,300, పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

. మినుముల కనీస మద్దతు ధర రూ. 7, 400, కందిపప్పు కనీస మద్దతు ధర రూ. 7 500, మినుముల కనీస మద్దతు ధర రూ. 7,400, గతేడాది కంటే రూ.450 ఎక్కువ కావ‌డం విశేషం. పెసర పంట కనీస మద్దతు ధర 8, 682, గతేడాది కంటే రూ. 12 ఎక్కువ, వేరుశనగ ఎంఎస్పీ క్వింటాల్ కు రూ. 6,783గా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.

గ‌త కొంత కాలంగా రైతులు త‌మ‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని కోరుతూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. వారి పోరాట ఫ‌లితంగా కేంద్ర స‌ర్కార్ దిగి వ‌చ్చింది. కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. లేక పోతే మ‌రోసారి పోరు బాట ప‌డ‌తామ‌ని కిసాన్ మోర్చా రైతు నేత రాకేష్ టికాయ‌ట్ హెచ్చ‌రించారు.