ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 సంవత్సరానికి గాను జీవన్ రక్షా పదక్ సీరీస్ అవార్డులకు సంబంధించి ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందులో భాగంగా జాబితాను వెల్లడించింది. 17 మందికి సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్, 9 మందికి ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ , 23 మందికి జీవన్ రక్షా పదక్ , 49 మందికి జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డ్స్ ను ఖరారు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జీవన్ రక్షా పదక్ అవార్డుకు నెల్లి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. కాగా మరణాంతరం ఆరుగురికి ఈ అవార్డులు దక్కాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు ద్రౌపది ముర్ము. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహనీయుల ప్రాణ త్యాగాలను ఈ సందర్బంగా స్మరించుకున్నారు. వారు చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఇవాళ దేశం స్వేచ్ఛతో విరాజిల్లుతోందని అన్నారు.
ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశంగా భారత్ వినుతికెక్కిందని అన్నారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛ, సమానత్వ ఫలాలను అందుకుంటున్నారని, ఇదంతా డెమోక్రసీ వల్లనే సాధ్యమైందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. ఆయన గనుక లేక పోయి ఉంటే ఇవాళ ఇలా ఉండేవాళ్లం కాదన్నారు ద్రౌపది ముర్ము.