ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్
అమరావతి – కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారానికి ఉద్దీపన కలిగించేలా తీపి కబురు చెప్పింది. కంపెనీకి రూ. 11,440 కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆనాటి దివంగత ప్రధాని వాజపేయ్ రూ. 1600 కోట్ల రుణాలను మాఫీ చేశారు. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించక పోగా తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించింది. ఈ సందర్బంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి వంగలపూడి అనిత.
ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కంపెనీ కోసం వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు సమైక్యంగా వివిధ సంఘాలు, సంస్థలతో పోరాటం చేశారు. మరో వైపు గత జగన్ రెడ్డి సర్కార్ వల్లనే కంపెనీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ ఆరోపించింది.
ఈ తరుణంలో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏకంగా స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా చేపట్టారు. ఆపై నిరాహారదీక్ష చేపట్టారు. మోడీపై నిప్పులు చెరిగారు. తన స్నేహితుడు గౌతమ్ అదానీ కోసం దీనిని అప్పగించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. ఈ తరుణంలో చంద్రబాబు చేసిన చాణక్యం ఫలించింది. ఎట్టకేలకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ లభించింది.