NEWSTELANGANA

నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వేకు టెండ‌ర్స్

Share it with your family & friends

టెండ‌ర్లు పిలిచిన కేంద్ర ప్ర‌భుత్వం

ఢిల్లీ – కేంద్ర స‌ర్కార్ తెలంగాణ‌కు తీపి క‌బురు చెప్పింది. రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు ఓకే చెప్పింది. సంగారెడ్డి లోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వ‌ర‌కు నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వేకి టెండ‌ర్స్ ను పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా చేప‌ట్టే రోడ్డు నిర్మాణానికి గాను రూ. . 5,555 కోట్ల రూపాయలు ఖ‌ర్చ‌వుతుంది. రెండు సంవత్సరాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది.

ర‌హ‌దారుల నిర్మాణంపై మోడీ ప్ర‌భుత్వం దృష్టి సారించింది. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హ‌యాంలోనే దేశంలో రోడ్ల నిర్మాణం ఎక్కువ‌గా జ‌రిగింది. ఆ త‌ర్వాత మోడీ వ‌చ్చాక పెద్ద ఎత్తున దేశంలో మౌలిక స‌దుపాయ‌ల వ‌స‌తి క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టారు.

పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టులు, ర‌హ‌దారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం కోరిన టెండ‌ర్ల‌లో సంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు,
రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీట‌ర్లు మొత్తం
161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణం జ‌ర‌గ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *