NEWSNATIONAL

భార‌తీయుల భ‌ద్ర‌త‌పై ఆందోళన‌

Share it with your family & friends

బంగ్లాదేశ్ సైన్యంతో జై శంక‌ర్ ఆరా

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళ‌న చెందుతోంది. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ లో అనిశ్చిత ప‌రిస్థితి నెల‌కొంది. దేశ ప్ర‌ధానమంత్రిగా ఉన్న షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆమె త‌న నివాసాన్ని వ‌దిలి పెట్టి ఇంగ్లండ్ కు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ త‌రుణంలో అక్క‌డ కూడా ప‌రిస్థితులు అంత బాగా లేక పోవ‌డంతో షేక్ హ‌సీనా వ‌చ్చేందుకు ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఆమె భార‌త దేశాన్ని ఎంచుకుంది. త‌న‌కు చిర కాలం నుంచి మిత్ర దేశంగా ఉంటూ వ‌స్తోంది ఇండియా.

ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ తో భేటీ అయ్యారు షేక్ హ‌సీనా. ఆమెకు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ప్ర‌ధానంగా ఇండియాకు మొదటి నుంచి సానుకూలంగా ఉంటూ వ‌చ్చారు. వ్యాపార వాణిజ్య ప‌రంగా ఇరు దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు ఉన్నాయి.

ప్ర‌స్తుతం పాకిస్తాన్, చైనా అనుకూల ప్ర‌భుత్వం ఏర్పాటయ్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. ఈ త‌రుణంలో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు చేసే సూచ‌న‌ల పైనే షేక్ హ‌సీనా భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంద‌నేది టాక్. ఈ త‌రుణంలో రాజ్య‌స‌భ వేదిక‌గా కేంద్ర మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం 19 వేల మందికి పైగా హిందూవులు ఉన్న‌ట్లు త‌మ విచార‌ణలో తేలింద‌న్నారు. వారి భ‌ద్ర‌త గురించి ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలిపారు.