NEWSNATIONAL

చ‌రిత్ర సృష్టించిన మోడీ

Share it with your family & friends

మూడోసారి కొలువుతిరిన ప్ర‌ధాని
న్యూఢిల్లీ – న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వినుతికెక్కిన 143 కోట్ల భార‌తీయులు నివ‌సిస్తున్న భార‌త దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరారు. 75 ఏళ్ల స్వ‌తంత్రం వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రేసేత‌ర వ్య‌క్తి పీఎంగా కొలువు తీర‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

వ‌చ్చే ఏడాది 2025లో ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరిన న‌రేంద్ర మోడీకి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు. 2024లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీయే, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కొలువు తీరేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి మూడుసార్లు ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న పేరు మీద ఉన్న రికార్డును న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ చెరిపి వేశారు. గుజ‌రాత్ లో సాధార‌ణ కుటుంబంలో జ‌న్మించిన మోడీ ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించారు. రైల్వే స్టేష‌న్ లో టీ స్టాల్ లో చాయ్ అమ్మారు. ఇప్పుడు సుమున్న‌త భార‌తావ‌నికి దేశాధినేత‌గా అవ‌త‌రించారు మోడీ.