నరేంద్ర మోడీకి లైన్ క్లియర్
9న ముహూర్తం ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన తన జీవిత కాలంలో తను ప్రధానిగా ఇన్నేళ్ల పాటు ఉంటానని కూడా అనుకుని ఉండడు. గత 10 ఏళ్ల కాలంలో చేయని ప్రయత్నం అంటూ లేదు. అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టించారు. కేవలం డబ్బున్న వాళ్లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు.
ఏకంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్లాన్ వేశారు. కానీ జనం చీదరించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. అంతిమంగా తను మూడోసారి పీఎం కాబోతున్నారు. ఇందుకు తెలుగుదేశం పార్టీతో పాటు నితీశ్ కుమార్ మద్దతు ఇచ్చారు. దీంతో మోడీ గట్టెక్కారు.
బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. ఆయన ఏపీలో భారీ మెజారిటీని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే – బీజేపీ కీలక సమావేశం ముగిసింది. అన్ని పార్టీలు నరేంద్ర మోడీని పీఎంగా ప్రతిపాదిస్తూ లేఖలు ఇచ్చారు. వారంతా తమ లేఖలను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అందజేశారు. ఈనెల 9న పీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ.