జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం
పార్లమెంట్ లో బిల్లుకు రెఢీ
న్యూఢిల్లీ – ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్ నేతృత్వంలో కమిటీ నివేదికకు ఓకే చెప్పింది కేంద్రం. కమిటీ నివేదిక ను అధ్యయనం చేసిన కేంద్ర కేబినేట్ ఇకపై దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టనుంది.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్లు సహా 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలోని ప్యానెల్ వెల్లడించింది.
ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ఇటీవల ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధాని మోదీ జమిలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి రావొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము జరిపిన అభిప్రాయ సేకరణలో 80 శాతం మంది సానుకూలంగా ఉన్నట్లు తేలిందన్నారు. దీని కారణంగానే తాము ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు.