NEWSTELANGANA

రెండు చోట్ల రాహుల్ గెలుపు ప‌క్కా

Share it with your family & friends

కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అజ్జూ

హైద‌రాబాద్ – భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌నం కోసం, దేశ హితం కోసం రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌, రెండో ద‌శ‌లో చేప‌ట్టిన న్యాయ్ యాత్ర‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింద‌న్నారు.

తాము ఏం చెప్పామో అదే చేసి చూపిస్తున్నామ‌ని అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను క‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయ‌త్వంలో ప్ర‌స్తుత స‌ర్కార్ అద్భుతంగా ప‌ని చేస్తోంద‌ని కితాబు ఇచ్చారు.

ఈసారి జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లు అత్యంత ముఖ్య‌మ‌ని అన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ వ‌ల్ల 143 కోట్ల మంది భార‌తీయులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక రాహుల్ గాంధీని విమ‌ర్శించే నైతిక హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింద‌ని చెప్పారు.

ఈసారి ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్.