NEWSNATIONAL

భార‌త్ పై యూన‌స్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends


త‌మ‌ది అంత‌ర్గ‌త వ్య‌వ‌హారమ‌న్న పీఎం

బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధాన‌మంత్రి మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ నిప్పులు చెరిగారు. 84 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన నోబెల్ బ‌హుమ‌తి పొందిన గ్ర‌హీత‌. తాజాగా దేశంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు, ప‌రిమాణాల నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న షేక్ హ‌సీనా రాజీనామా చేశారు.

ఆమె ప్ర‌స్తుతం భార‌త దేశంలో ఆశ్ర‌యం పొందారు. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ లో నివ‌సిస్తున్న హిందువుల‌పై మ‌త చాంధ‌స‌వాదులు పెట్రేగి పోతున్నారు. వారిపై దాడుల‌కు దిగుతున్నారు. ప్రార్థ‌నా మందిరాల‌ను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది మోడీ ప్ర‌భుత్వం. వారికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

దీనిపై స్పందించారు తాత్కాలిక ప్ర‌ధాన‌మంత్రి మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో త‌మ దేశానికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన ఇండియా వేలెత్తి చూపితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌ని పేర్కొన్నారు .

ఈ సంద‌ర్బంగా “సోదరుడి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే, అది అంతర్గత వ్యవహారమని నేను ఎలా చెప్పగలనంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.