పోలీసుల నోటీసుపై మోహన్ బాబు సవాల్
తనకు వ్యక్తిగత భద్రత కల్పించాలని డిమాండ్
హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనకు ఎలా నోటీసులు జారీ చేస్తారంటూ ప్రశ్నించారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సెక్యూరిటీ ఇవ్వాలని విన్నవించినా పట్టించు కోలేదని , తనకు తక్షణమే భద్రత కల్పించాలన్నారు నటుడు.
విచిత్రం ఏమిటంటే ఓ రణరంగాన్ని తలపింప చేసింది మంచు ఫ్యామిలీ గొడవలు. ఎక్కడ చూసినా బౌన్సర్లు దర్శనం ఇస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టారు. ఇదేదో రాయలసీమ సంస్కృతికి అద్దం పట్టేలా ఉంది.
అందరూ చూస్తూ ఉండగానే మోహన్ బాబు రెచ్చి పోయాడు. ఆపై టీవీ9 ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు. తన పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ వైపు గొడవలు జరగలేదంటూనే మరో వైపు పోటా పోటీగా తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లకు వెళ్లారు.
ఒకరు పహాడి షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేస్తే మరొకరు రాచకొండ సీపీని కలిశారు. తీరా పోలీసులు సహకరించడం లేదంటూ తనకు భద్రత కావాలని పిటిషన్ దాఖలు చేయడం విస్తు పోయేలా చేస్తోంది.